‘శాకినీ-ఢాకినీ’గా రెజీనా, నివేదా!కొరియన్ సెన్సేషనల్ హిట్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ యొక్క తెలుగు రీమేక్ చివరి దశలో ఉంది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘శాకినీ – ఢాకినీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా టైటిల్ రోల్ లో రెజీనా కసెండ్రా, నివేదా ధామస్ ట్రైనీ పోలీసుల పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఓ బేబీ సినిమా కొరియన్ చిత్రం అయిన ‘మిస్ గ్రానీకి’ రీమేక్. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘శాకినీ – ఢాకినీ’ మూవీ కూడా కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కు రీమేక్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నఈ సినిమా షూటింగ్ గతంలోనే మొదలైంది. కానీ, మధ్యలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ను పున ప్రారంభించామని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

x