ఆనాడు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఒక మాట చెప్పారు.. అది ఏమిటంటే పుట్టిన వాడు మరణించక తప్పదు.. మరణించిన వాడు మళ్లీ పుట్టక తప్పదు.. మరి ఎందులకు భాద పడుదురు అంటూ శ్రీ కృష్ణుడు చెప్పారు. ఈ విషయానికి సంబంధించి తాజాగా ఆర్జీవీ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా మరణమంటే అందరికీ చాలా భయం ఉంటుంది. కానీ ఆర్జీవీ మాత్రం తనకు అసలు భయం లేదని వాపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఏదొక సమయంలో చనిపోతారని దానికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి మనం ఈ చావు గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని అంటున్నాడు.

పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు, ఒకవేళ చావు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉండకూడదని, బాంబు పేలుడు చూస్తూ చనిపోవాలని చెప్పుకొచ్చారు. ఇలాంటి వింత కోరికకు గల కారణం ఏమిటి అని అడిగినప్పుడు.. బాంబు ఎలా పేలుతుంది అనే దృశ్యాన్ని చూడాలనుకుంటున్నాను అని ఆర్జీవీ సమాధానమిచ్చాడు. ఆయన మాటలు విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

x