చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ఒక దొంగల ముఠా బెంగుళూరు వెళ్తున్న ఓ కంటైనర్ ను అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. ఆ కంటైనర్ లో సుమారు రూ.6.5 కోట్ల విలువైన ఎం.ఐ స్మార్ట్ ఫోన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ దొంగల ముఠా వాటిని చోరీ చేశారు.

ఈ కంటైనర్ తమిళనాడులోని కాంచీపురం నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ తో వెంబడించిన దొంగలు కంటైనర్ ను హైజాక్ చేసి, హైవేపై కొద్ది దూరం ప్రయాణం చేశారు. ఆ తర్వాత కంటైనర్ లోని రూ.6.5 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ ను దొంగతనం చేసి, వాహనాన్ని డ్రైవర్ కి అప్పగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

image source

x