Roberrt Movie Telugu Review

ఈ సినిమా కథ లక్నోలో మొదలవుతుంది. రాఘవ చాల మంచి వ్యక్తి. బాధ్యత తెలిసిన వాడు, గొడవలకి అస్సలు పోడు. రాఘవకి చిన్న కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే అతనికి ప్రపంచం, మిగతావాటితో సంబంధం లేదు. అతన్ని చక్కగా చూసుకోవాలి, ప్రశాంతంగా చూసుకోవాలి అన్నదే అతని లక్ష్యం.

ఒక క్యాటరింగ్ సర్వీస్ లో వంటవాడిగా పని చేస్తా ఉంటాడు. వంట చేశాడంటే అదిరిపోవాలి అంతే. గొడవలకి రాఘవ దూరంగా ఉండాలి అనుకుంట ఉంటాడు కానీ గొడవలే రాఘవ దగ్గర వరకు వస్తుంటాయి. తనని ఏమి చేసిన పట్టించుకోడు. కానీ కొడుకు జోలికి వస్తే రాఘవలోని రావణుడు బయటకి వస్తాడు.

ఆ సందర్భం వచ్చింది రావణుడు బయటకి వచ్చాడు. ఇక తప్పలేదు నిజం బయటకి రావాల్సి వచ్చింది. రాఘవ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో అతని పేరు రాఘవ కాదు రాబర్ట్.

రాబర్ట్ ఎవరు? అతని ఘనత ఏంటి? అతను ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? రాబర్ట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు జగ్గుభాయ్ మరియు రవిశంకర్ కి, రాబర్ట్ కి సంబంధం ఏంటి? ఇవే ప్రశ్నలు ఇవన్నీ తెలుసుకోవడమే కథ.

విశ్లేషణ:

ఈ సినిమా గురించి సింపుల్ ఐడియా తీసుకుంటేనే క్లారిటీ వచ్చేస్తుంది. రాబర్ట్ మూవీ బాషాకు బావమరిది, సమరసింహారెడ్డికి తమ్ముడు లాగా అనిపిస్తుంది. బాషా, సమరసింహారెడ్డి సినిమాల్లో ఉన్న ఫార్ములానే ఈ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముందుగా సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం.

మొదటి ప్లస్ మాత్రం చాల్లేజింగ్ స్టార్ డి బాస్ దర్శన్. ఆయన సింపుల్ గానే కనిపిస్తారు. కానీ అయన మాస్ యాక్షన్ భలే ఉంటుంది. డి బాస్ లో మరో ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉంది. అది ఏంటంటే పౌరానికల్లో పద్యాలను భలే అదరకొడుతుంటారు.

కన్నడాలో కురుక్షేత్రం సినిమా వచ్చింది. అందులో దుర్యోధనుడి పాత్ర పోషించారు దర్శన్. చాలా అద్భుతముగా చేసారు. రాబర్ట్ సినిమాలో కూడా పౌరానికం టచ్ ఇచ్చి, సూపర్ ఫైట్ చేసారు. ఆ ఫైట్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్ అని చెప్పచ్చు. ఆ ఫైట్ ని రామ్ లక్ష్మణ్ మాష్టర్స్ డిజైన్ చేసినట్టు అనిపించింది. ఆ ఫైట్ ని దర్శన్ ఫాన్స్ మాస్ ఆడియన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు.

రావణాసురుడి రోషాన్ని, పౌరుషాన్ని తెలియజేసేలాగా ఉంటాయి ఆ పద్యాలు చెబుతు ఫైట్ చేస్తాడు దర్శన్. సాధారణంగా అయితే ఈ సినిమా కమర్షియల్ ప్యాకేజ్. ఫైట్స్, సాంగ్స్, కామెడీ, హీరో ఎలివేషన్ ఇలాంటి విషయాలు మాత్రమే పట్టించుకోని సినిమా చూస్తే టైంపాస్ అవుతుంది.

దర్శన్ పెద్ద స్టార్, బిగ్ బడ్జెట్ మూవీ. సౌత్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెద్దగానే కనిపిస్తాయి ఈ సినిమా అంత కూడాను. ఎక్కడా గ్రాండ్ లెవెల్ తగ్గదు. ఫైట్స్ లో గానీ, సాంగ్స్ లో గానీ, సెట్స్ విషయంలో దగదగలు, మెరుపులు, అరుపులు. ఈ సినిమాలో ఒక పాటకి మంగలి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు. కన్నే అదిరింది ఈ పాట వింటానికే కాదు ఆన్ స్క్రీన్ మీద చూడటానికి కూడా చాలా బాగుంది.

ఎందుకంటే కోరియోగ్రఫీ బాగుంది, మంచి లొకేషన్ లో సూపర్గా ఆర్ట్ వర్క్ ని ఇన్వాల్వ్ చేసి భలే తీశారు పాటని. హీరోయిన్ కూడా మంచి డాన్సర్ మంచి గమ్మత్తు జరిగిపోద్ది ఆ పాటలో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లెమ్ సినిమాలో కొత్తగా చూస్తున్నట్టు అనిపించగ పోగా మూవీ చూస్తున్నంత సేపు మనం ఆల్రెడీ చూసిన సీన్స్ ఇక్కడ చాలా సిమిలర్ గా ఉన్నట్టు అనిపించాయి.

ఏ మాత్రం కొంచం ఫ్రెష్ అనిపించినా వేరేలా ఉండేదేమో మూవీని ఒక రెగులర్ నోట్ తోనే స్టార్ట్ చేసారు. లవ్ ట్రాక్ కూడా అంత కొత్తగా ఏమీ లేదు. అలా ప్రొసీడింగ్స్ అయ్యాక మూవీ మిడ్ పాయింట్ అయ్యాక హీరో మరియు విలన్ కి పరిచయం చేసారు. సెకండ్ ఆఫ్ లో రెండు ఫైట్ లు అదిరిపోయాయి. ఒకటి బాగా స్టైలిష్ గా డిజైన్ చేసారు. ఇంకొకటి సోషల్ ఇస్యూస్ కి రిలేటెడ్ గా తీసేసారు.

ఇంకా పెరఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆషా భట్ లవ్ ట్రాక్ కి మాత్రమే పరిమితమైంది. పెరఫార్మెన్స్ చేయడానికి పెద్ద స్కోపే లేదు. రాబర్ట్ స్నేహితుడుగా చేసిన అతను బాగా పెరఫార్మెన్స్ చేసాడు. జగతిపతి గారు మరియు రవికృష్ణ గారు బాగా నటించారు.

టెక్నికల్స్:

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బై వి. హరికృష్ణ బాగా ఇచ్చారు. విజువల్స్ బై సుధాకర్ బాగా చేసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అదిరిపోయాయి. బాగా ఖర్చు పెట్టారు, అది స్క్రీన్ పై కనిపిస్తుంది.

x