ఏపీఐఐసీ (APIIC) చైర్‌పర్సన్, మరియు నగరి ఎమ్మెల్యే రోజా గారు మేజర్ సర్జరీ కోసం గత నెలలో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజుల క్రితం, రోజా గారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రోజా గారి ఆరోగ్యం గురించి ఎటువంటి అప్డేట్ లేదు.

కనుక రోజా గారు ఒక వీడియో ని విడుదల చేసారు, వీడియోలో ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడుతూ, ఆమె బాగా కోలుకుంటున్నారని, మరో నెల రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ తెలిపారు. ఈ వీడియో ద్వారా మీ ముందు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.ఎవరితే నేను తొందరగా కోలుకోవాలి అని కోరుకున్నారో వారికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

“నన్ను వ్యక్తిగతంగా పిలిచి, నా ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందని ఆరా తీసిన మన ఏపీ సీఎం వైయస్ జగన్ గారికి కూడా నా కృతజ్ఞతలు. అంతేకాకుండా వైసీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా ధన్యవాదాలు అంటూ రోజా గారు వీడియో లో చెప్పుకొచ్చారు.

రోజా గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయానని నిరాశ చెందారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఏప్రిల్ 8 న జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ YCP అభ్యర్థులకు ఓటు వేయాలని మరియు జగన్ నాయకత్వాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. సిఎంగా జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలని నేను కోరుకుంటున్నాను, ”అని రోజా గారు అన్నారు.

x