సినీ ఇండస్ట్రీ లో భారీ పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ‘పూజా హెగ్డే’ ఒకరు. ఇటీవల ప్రకటించిన మహేష్ బాబు సినిమాకి ఆమె దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఈమె రెమ్యునరేషన్‌ తో పాటు, ఆమె అసిస్టెంట్స్ బెల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రముఖ దర్శక నిర్మాత ఆర్‌.కె. సెల్వమణి స్పందించినట్లు వార్తలొస్తున్నాయి.

పూజా హెగ్డే తన స్టార్ డమ్ తో నిర్మాతలపై అదనపు భారాన్ని పెంచుతుందని ఆర్‌.కె. సెల్వమణి పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభంలో పూజా హెగ్డే కు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉండేవాడు. అతనే తన మేకప్, డ్రెస్సింగ్ మరియు స్టైలింగ్ మొదలైనవాటిని చూసుకునేవాడు. కానీ, స్టార్ డమ్ వచ్చిన తరువాత ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమెకు దాదాపు 12 మంది అసిస్టెంట్స్ ఉన్నారు. ఆమెకు 12 మంది అసిస్టెంట్స్ ఉండాల్సిన అవసరం ఏమిటి? అంటూ సెల్వమణి ప్రశ్నించారు.

పూజా హెగ్డే తన స్టార్ డమ్ తో నిర్మాతలపై అదనపు భారాన్ని పెంచుతుందని మరియు తన అసిస్టెంట్స్ అందర్నీ పోషించాలంటే నిర్మాతలకు చాలా ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై పూజా హెగ్డే ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్ దళపతి నటిస్తున్న బీస్ట్‌ సినిమాలోను, హిందీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమాలోను నటిస్తుంది. అయితే, మరోవైపు ప్రభాస్ తో నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

x