ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మహమ్మారి కరోనా లేకపోతే, మేకర్స్ ఇప్పటికల్లా షూటింగ్ ను పూర్తీ చేసేవారు. కరోనా పరిస్థితి స్థిరపడిన తర్వాత మాత్రమే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
మూవీ షూటింగ్ లో రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై చిత్రీకరించబడుతుంది. ఈ సాంగ్ షూట్ చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని సినీ వర్గాల సమాచారం. ఈ పాటతో పాటు, చిత్రీకరించడానికి మరో సాంగ్ మిగిలి ఉంది, ఇది రామ్ చరణ్ మరియు అలియా భట్ లపై తీస్తున్నట్లు సమాచారం. షూట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.
ఎస్.ఎస్.రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ మరియు బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించనున్నారు. డివివి దానయ్య ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.