భారతదేశం మొత్తం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటి ఈ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి వంటి పెద్ద సినిమా తీసిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మరో పెద్ద సినిమా ఇది. ఈరోజు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ నుంచి ఒక వీడియో విడుదల అయ్యింది.
ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, ఆలియాభట్, అజయ్ దేవగన్ మరియు మన డైరెక్టర్ రాజమౌళి కనిపించారు. ఈ వీడియోలో వారు కరోనా ప్రోటోకాల్స్ గురించి వివిధ భాషల్లో మనకు తెలియజేశారు. ఇందులో ఆలియాభట్ స్పష్టమైన తెలుగు భాష లో మాట్లాడారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి కెనడా, మలయాళం మరియు తమిళ భాషలో మాట్లాడారు.అజయ్ దేవగన్ తన మాతృభాష అయిన హిందీ భాషలో మాట్లాడారు.
వీరందరూ వీడియో ద్వారా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మరియు మహమ్మారి ప్రాథమిక జాగత్తలను అనుసరించాలని సందేశాన్ని ఇచ్చారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, తప్పకుండా టీకాలు వేయించుకోవాలని వారు చెప్పారు.
వీడియోను షేర్ చేస్తూ రామ్చరణ్ ఇలా రాశాడు. మాస్కులు ధరించాలని, అందుబాటులో ఉన్నపుడు టీకాలు వేయించుకొని వైరస్ వ్యాప్తిని ఆపడానికి మరియు మన దేశాన్ని కరోనా నుండి కాపాడడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. భాష మరియు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ఆకర్షించే విదంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Wear a mask always ?
Get vaccinated when available ?….Let’s #StandTogether to Stop The Spread of #COVID19 in India ??✊? pic.twitter.com/yEWvniO6LH
— RRR Movie (@RRRMovie) May 6, 2021
ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా అజయ్ దేవగన్ మరియు ఆలియాభట్ టాలీవుడ్లోకి అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా స్వతంత్ర పూర్వ యుగానికి చెందిన ఇద్దరు ప్రసిద్ధ విప్లవకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.