కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు అన్ని మూసుకుపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నందున చాలా వరకు కార్యకలాపాలు నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ పరిశ్రమ కూడా షూటింగ్స్ కు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. రెండు నెలల విరామం తర్వాత హీరో నితిన్ తన ‘మాస్ట్రో’ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

కానీ RRR, రాధే శ్యామ్, పుష్ప వంటి పెద్ద బడ్జెట్ సినిమాలు ఇంకా షూటింగ్ ను మొదలు పెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి జూలై 1 నుండి RRR మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

మహమ్మారి కరోనా వల్ల ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తయింది. ఎస్ ఎస్ రాజమౌళి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కావడం వల్ల మిగిలిన బ్యాలెన్స్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. దీంతో సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమౌళి షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాతే విడుదల తేదీ పై ఒక క్లారిటీ వస్తుంది.

x