ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ టాప్ రైటర్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని ఆ రైటర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ సినిమాకి వస్తే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై డైరెక్టర్ శంకర్ పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మొట్టమొదటిసారిగా డైరెక్టర్ శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో డైలాగ్స్ రాయడం కోసం తెలుగు రైటర్ ‘సాయి మాధవ్’ ను సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన RRR సినిమా కు అద్భుతమైన డైలాగ్ లు అందించారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా ఆయన మాటలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే శంకర్ మరో ఆలోచన లేకుండా “సాయి మాధవ్ బుర్ర” ను తీసుకున్నారు.

సాయి మాధవ్ శంకర్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని పంచుకున్నారు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు ఆయన తో ఒక ఫోటో దిగితే చాలా అనుకున్నాను అలాంటిది, ఇప్పుడు ఆయన సినిమాకు మాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది.. అంటూ శంకర్, రామ్ చరణ్ మరియు దిల్ రాజు కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

 

x