మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం యొక్క టైటిల్ ను మూవీ మేకర్స్ కొద్దీ సేపటి క్రితం విడుదల చేశారు. ఈ సినిమాకి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ మేకర్స్ టైటిల్ తో పాటు ఒక చిన్న రొమాంటిక్ టీజర్ ను కూడా విడుదల చేశారు.

మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో హీరోయిన్ కేతిక శర్మ హీరోకి బట్టర్ ఫ్లై(butterfly) కిస్ అనే కొత్త రకం ముద్దు గురించి వివరిస్తూ కనిపించింది. టీజర్ చూడటానికి చాలా రొమాంటిక్ గా మరియు ఆసక్తికరంగా ఉంది. అర్జున్ రెడ్డి యొక్క తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన ‘గిరీశయ్య’ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

బివిఎస్ఎన్ ప్రసాద్ గారు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్‌దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా ఉండనున్నారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలియనున్నాయి.

 

x