సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ మరియు ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి హిట్ సినిమాల తర్వాత ‘రిపబ్లిక్’ అనే సినిమాను చేస్తున్నారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు గతంలో మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.

ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో అందరు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని భావించారు. కానీ, వాటన్నిటికీ చెక్ పెడుతూ మూవీ మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 1న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లో ‘పంజా అభిరామ్.. జిల్లా కలెక్టర్’ అనే ఒక నేమ్ బోర్డ్ కూడా ఉంది. దీని బట్టి హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో కలెక్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

కొల్లేరు సరస్సు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐశ్వర్య రాజేష్ తో రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌ తో కలిసి జేబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భగవాన్ మరియు పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

x