పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ప్రభాస్ నటిస్తున్న మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్ ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం ‘సాలార్‘ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

సాలార్ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతేకాదు కీలకమైన ఇంటర్వెల్ పాయింట్ ను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ 5 నుంచి 7 రోజుల వరకు జరగనుంది. ఇంతకముందు షెడ్యూల్ తెలంగాణలోని గోదావరిఖని ప్రాంతంలో జరిగింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు మరియు కన్నడలో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హిందీ, తమిళం, మలయాళం వంటి ఇతర భాషల్లోకి డబ్ చేయబడుతుంది. చిత్రబృందం ఈ సినిమాను 2022 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K సినిమాల్లో నటిస్తున్నారు.

x