ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ చేతిలో ఉన్న మరొక సినిమా ‘సాలార్’. ఈ సినిమాకు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతుంది. నివేదికల ప్రకారం, సాలార్ మూవీ పూర్తిగా 1970 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం 1971లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని కలిగి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి మూవీ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కనుక, ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2022 లో థియేట్రికల్ విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ లోను మరియు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్-k లోను నటిస్తున్నారు.

x