రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో “సాలార్” మూవీ ఒకటి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలం నుంచి ఎదురుచుతున్నారు. ఈ పెద్ద ప్రాజెక్టు కోసం ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ప్రభాస్ కు స్టైలిష్ మేక్ఓవర్ ను ఇవ్వనున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నప్పటికీ, ఈ చిత్రంలో ప్రభాస్ ను ఎప్పుడు చూడని విధంగా కనిపించనున్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసం మేకర్స్ ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీని కోసం బాలీవుడ్ కి చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ని పిలిపించారు.

ఈ సినిమా పాన్ ఇండియా గా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

x