ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే మంచి టైమ్ అనుకోని కొంత మంది డాక్టర్స్ డబ్బులు కోసం కక్కుర్తి పడుతున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ అని అమ్మి క్యాష్ చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

నిజామాబాద్ లో రెమ్డెసివిర్ ఇంజక్షన్ చేస్తామని భారీ మోసం చేసిన డాక్టర్ మరియు కాంపౌండర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాళీ రెమ్డెసివిర్ బాటిల్స్ లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న డాక్టర్ మరియు కాంపౌండర్ ను అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ లో రెమ్డెసివిర్ ఇంజక్షన్ అమ్ముతున్నామని చెప్పి ఇలా సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్నారని పోలీసులు చెప్పారు.

నిజామాబాద్ జిల్లా చేకూరు గ్రామానికి చెందిన ఒక పేషెంట్ నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అయితే అతని కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉండటంతో రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ అవసరం పడ్డాయి. దీంతో తనకు పరిచయం ఉన్న మరో ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్ ను కలిశాడు. అప్పుడు కాంపౌండర్ తమ దగ్గర రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఉన్నాయని చెప్పాడు. ఆ ఇంజక్షన్ చేసేటప్పుడు ఆ పేసెంట్ కు అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు.

x