సల్మాన్ ఖాన్ నుంచి ఇటీవల వస్తున్నా చిత్రం “రాధే” ఈ సినిమా ఏకకాల సమయంలో థియేటర్స్ తో పాటు డిజిటల్ విడుదలను ఎంచుకుంది ఈ విషయాన్ని ఫిల్మ్ యూనిట్ ఇటీవలే ధృవీకరించింది. చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ట్రయిలర్ ను విడుదల చేసింది. ఆ ట్రయిలర్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధంలోని ‘సీటి మార్’ పాటను సల్మాన్ ఖాన్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను రీ కంపోజ్ చేశాడు. ఈ రోజు, ఫిల్మ్ యూనిట్ ఈ పాటను అధికారికంగా విడుదల చేసింది. ఈ పాట లో నటించిన సల్మాన్ ఖాన్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పాట యొక్క లింక్‌ను పంచుకుంటూ సల్మాన్ ఖాన్ ఇలా వ్రాశాడు, “సీటీ మార్కు కు ధన్యవాదాలు అల్లు అర్జున్, పాటలో మీరు ప్రదర్శించిన విధానం, మీ డ్యాన్స్, మీ స్టైల్ అంతా అద్భుతం అని అన్నాడు.

ఈ పాటకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. షబ్బీర్ అహ్మద్ హిందీ సాహిత్యం రాశారు. DSP యొక్క గాత్రంతో కోరస్. తెలుగు కొరియోగ్రాఫర్ జానీ ఈ పాటకు పనిచేశారు. మే 13 న ఈ సినిమా తెరపైకి రానుంది.

 

x