సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 14 గా శివలింగ, కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో హరి, హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే యశోద మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

Samantha as a pregnant lady ..!

అయితే, ఈ సినిమాలో సమంత ఓ చాలెంజింగ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్, సూపర్ డీలక్స్ వంటి చిత్రాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన సమంత రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు యశోద సినిమా కోసం ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కీర్తి సురేష్, నయనతార, విద్యాబాలన్ వంటి స్టార్స్ గర్భిణీ పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు సమంత కూడా యశోదా సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే సమంత నర్సి గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సమంత ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సమంత దాదాపు గంటకుపైగా ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తున్నట్లు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ నాగ చైతన్య తో కలిసి ఉంటే రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో సమంత ప్రెగ్నెంట్ వార్త వినే వాళ్ళము అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత ప్రెగ్నెన్సీ కోరికను ఈ రకంగా తీర్చినుకుంటుంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సమంత అక్కడ ప్రముఖ యశ్ రాజ్ ఫిలిమ్స్ తో వరసగా మూడు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో కూడా నటించనున్నట్లు సమాచారం.

x