సమంత తన కెరియర్ ను స్టార్ట్ చేసి 10 ఏళ్లు అవుతున్నా ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. ఐదేళ్ల క్రితం వచ్చిన రష్మిక మాత్రం హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా సమంత బాలీవుడ్లో దూకుడు చూపిస్తుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తీయబోయే 3 సినిమాల్లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

లాక్ డౌన్ సమయంలో సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తనకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. వెబ్ సిరీస్ లో నటించిన నటీనటులు అందరికంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది. దీంతో మరిన్ని వెబ్ సిరీస్ ఆఫర్లు వచ్చాయి. మొదటిసారి హిందీ ఆఫర్ కూడా దక్కిందన్న ప్రచారం బాలీవుడ్లో జోరుగా వినిపించింది.

నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత ఆ జ్ఞాపకాలు మర్చిపోవడానికి, డిప్రెషన్ తన దగ్గరికి చేరనీయకుండా పనిలో బిజీ అయిపోతుంది. పుష్ప సినిమలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వస్తే ఆలోచించకుండా ఓకే చేసింది. హిందీ వెబ్ సిరీస్ తో పాటు యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసే 3 సినిమాలకు సమంత ను హీరోయిన్ గా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టులు ఏమిటో త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే, సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ఆమె నటిస్తున్న ‘యశోద’ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. అంతేకాదు సమంత “అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్” అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది.

ఇందులో సమంత ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ కి చెందిన ప్రముఖ డైరెక్టర్ ‘ఫిలిప్ జాన్’ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు సమంత తమిళంలో విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయనుంది. ఇలా సమంత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

x