ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో వినాశనం సృష్టిస్తుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చేతులు కలుపుతున్నారు.ఈ పరిస్థిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు సినిమా హీరో సందీప్ కిషన్. అయన ఇప్పుడు నిజమైన హీరో అయ్యారు.

అతను ట్విట్టర్‌లో, అలాంటి పిల్లల సమాచారాన్ని తన ఈమెయిల్ ఐడికి పంపమని ప్రజలను కోరాడు. అతని బృందం వారికి చేరువ అవుతుంది మరియు రాబోయే రెండు సంవత్సరాలు అలాంటి పిల్లలకు ఆహారం మరియు విద్యకు అవసరమైన ఖర్చులను చూసుకుంటుందని చెప్పాడు.

“ఇది మనకు పరీక్షా సమయం, ఈ పరిస్థిలో మనమందరం మొదట మనుషులుగా ఉంది ఒకరొకరికి తోడుగా నిలబడటం చాలా ముఖ్యం” అని ఈ సందర్భంగా సందీప్ కిషన్ చెప్పారు. ఈ పరీక్షా సమయాల్లో సందీప్ కిషన్ ప్రజలకు తోడుగా నిలబడటం చాలా బాగుంది. ఇది చాలా మంది ముందుకు రావడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి స్ఫూర్తినిస్తుంది.

x