సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” అయితే, మూవీ మేకర్స్ మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఒక గ్లింప్స్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

ఆ బ్లాస్ట్ ఆగస్టు 9న ఉదయం 9.09 కి విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బెల్ట్ సరిచేసుకుంటూ GIF లో సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కీర్తి సురేష్ తో రొమాన్స్ చేయనున్నారు. 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

x