పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా మూవీ మేకర్స్ సినిమా యొక్క టీజర్ ను 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, టీజర్ ముందుగా లీక్ కావడంతో మూవీ మేకర్స్ అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
టీజర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంగ్ హెయిర్, మెడ మీద ట్యాటూతో సరికొత్త లుక్ లో కనిపించారు. ”ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్, ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్” అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.