మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ భర్త ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాడు. అతను మహిళల పై తన ప్రతాపాన్ని చూపించాడు. పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ మంజుల భర్త పేరు సుధాకర్. అక్కడి మహిళలను టార్గెట్ చేసుకున్న సుధాకర్ వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ చిత్రహింసలకు గురిచేశాడు.

తనలో వచ్చిన కోరికను తీర్చాలని మహిళల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడు. అంతేకాదు గ్రామంలో తనకు నచ్చిన మహిళను ఎంచుకొని వారితో తరుచు ఫోన్ లో మాట్లాడుతూ లైంగికంగా ఎంతో వేధించేవాడు. తనకు నచ్చిన మహిళలను తనతో గడిపేట్లు చేయాలని మరో మహిళను మధ్యవర్తిగా పెట్టుకొని రాయబారాన్ని కూడా నడిపించాడు. అయితే అసలు విషయం బయటికి రావడంతో గ్రామస్తులు వారిని గ్రామ పంచాయతీకి పిలిపించి పంచాయతీ పెట్టించారు. పంచాయతీకి వచ్చిన సర్పంచ్ మంజుల మరియు ఆమె భర్త సుధాకర్ పై గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడి వారిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పంచాయతీ వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

x