ప్రేమ కావాలి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్. ఆ తర్వాత లవ్లీ, ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఆది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

చాలా కాలంగా సరైన హిట్ లేక ఈ హీరో సతమతమయ్యాడు. ఈ క్రమంలో ఆది శశి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాసు నాయుడు నడి కట్ల తెరకెక్కించాడు.

రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జై హనుమాన్ మూవీస్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఒకే ఒక లోకం నువ్వే అనే పాట 50 మిలియన్లు పైగా వ్యూస్ దక్కించుకొని సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఆది కి ఎలాంటి ఫలితాన్ని అందించింది, కొత్త దర్శకుడు తొలి సినిమా తో హిట్ అందుకున్న దా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శశి మూవీ కథా విశ్లేషణ :

ముందుగా కథ విషయానికి వస్తే ప్రేమలో పడిన ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు కష్టాలు ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో తనకు రిలేషన్స్ లవ్ తర్వాత ఎలా మారుతాయి, అన్న అంశం ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఒక కాలేజీ కుర్రాడు తనతోపాటు చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తాడు.

అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి అతనికి దూరమవుతుంది. ఆ తర్వాత డిప్రెషన్ లో ఉండి ఒక రాక్ బ్యాండ్ ను రన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని ప్రేమ విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో, మధ్యలో కుటుంబ విషయంలో ఏం జరిగింది, అతని ప్రేమ కథ సుఖాంతం అయిందా లేదా అనేది తెర పై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

ఈసినిమాలో కావాల్సినంత డ్రామా ఉంది. చాలా సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో లో లవ్ స్టోరీ ఉంటూనే, ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

ఫ్యామిలీ యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెచ్చుకునే ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యేలా కథను రాసుకోవటం సినిమాకు పాజిటివ్ గా మారింది. అసలు శశి అని హీరోయిన్ పేరు టైటిల్ గా ఎందుకు పెట్టారు అని డౌట్ అందరికీ కలగటం సహజం.

సినిమాలో దానికి తగ్గ జస్టిఫికేషన్ దొరుకుతుంది. స్నేహానికి ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో ప్రేమను కూడా బ్యాలెన్స్ చేసే పాత్రగా శశి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాడు. ప్రేమ సన్నివేశాలు, ఆ తర్వాత హీరోయిన్ కి ఎదురైనా ప్రమాదాన్ని, హీరో డిప్రెషన్ కి గురి అవడం వంటి సన్నివేశాలను ఆకట్టుకునేలా రూపొందించారు.

ఆయా క్యారెక్టర్లకు నటీనటుల పెర్ఫామెన్స్ కూడా బాగా సెట్ అయింది. అయితే అక్కడ కథ కొంచెం, డ్రామా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాకు సంభాషణలు అదనపు బలాన్ని ఇస్తుంది. చాలావరకూ మాటల మనసును కదిలించేలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి.

ప్రేమలోని ఎమోషన్స్, ఫ్యామిలీ బాధ్యతలు, వాటి మధ్య ప్రేమికుల ఆవేదన గల సన్నివేశాలు ఆకట్టుకోగా, కొంత నిదానంగా కథ సాగటం సినిమాకి మైనస్ అని చెప్పచ్చు. ప్రేమ కథ అని ఎమోషనల్ గా సాగే సినిమాలను ఇష్టపడే వాళ్ళని శశి అలరించవచ్చు.

నటీనటుల విశ్లేషణ:

ఇక నటీనటుల విషయానికి వస్తే, డిప్రెషన్ లో ఉంది ఒక రాక్ బ్యాండ్ ని రన్ చేసే వ్యక్తి పాత్రలో, సెకండాఫ్ లో కాలేజ్ స్టూడెంట్, ఈ రెండు క్యారెక్టర్ కి చాలా డిఫరెంట్, అందుకు తగ్గట్టే విభిన్న నటన తో ఆది అలరించారు.

ఇక స్నేహానికి ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో ప్రేమను కూడా బాలన్స్ చేసే శశి పాత్రలో సురభి సహజ నటన కనబరిచింది. అలాగే మరో హీరోయిన్ రాశి సింగ్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా నటించింది.

హీరో అన్న పాత్రలో అజయ్ చక్కని నటన కనబరిచాడు. తల్లి పాత్ర చేసిన సీనియర్ నటి తులసి, రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు. వైవా హర్ష నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. ఇక మిగతా వాళ్లు ఉన్నంతలో ఓకే అని పిలుస్తారు.

సాంకేతిక విషయాలు :

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడి కట్ల ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. తొలి చిత్రంగా ఇంత డెప్త్ ఉన్న కథని ఎంచుకోవడం కొంచెం రిస్క్ అని చెప్పవచ్చు. తన కథను తెరపై చూపించడంలో ఓకే అనిపించినా అక్కడ అక్కడ తడబడి నట్లు అనిపిస్తుంది.

కథ ఇంకొంచం వేగంగా సాగింటే బాగుండేది అని అనిపిస్తుంది. అయితే తాను అనుకున్న ఎమోషనల్ మాత్రం పండించగలిగాడు. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రధాన బలం, అరుణ్ మ్యూజిక్ బాగుంది.

అలాగే ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్ ఎంత విజయం సాధించిందో చెప్పనవసరం లేదు, ఆ పాటే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.

నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా చూస్తే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ని అంటే ఎమోషనల్ గా ఇచ్చిన తీరు పర్వాలేదు అనిపిస్తుంది. అయితే సినిమా నిదానంగా సాగటం మైనస్ అయింది ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపిస్తుంది.

శశి మూవీ రేటింగ్: 2/5

x