ఈ రోజుల్లో కొంతమంది యువ చిత్ర నిర్మాతలు వైవిద్యమైన కథలతో ప్రయోగాలు చేస్తూ మన ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఒక ప్రత్యేకమైన కథతో మన ముందుకు వస్తున్నాడు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలో సత్యదేవ మరియు నిత్యా మీనన్ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమాకు “స్కైలాబ్” అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో సత్యదేవ్, నిత్యా మీనన్ మరియు రాహుల్ రామకృష్ణ ఒక శాటిలైట్ లాంటి ఆబ్జెక్ట్ పై కూర్చొని పయనిస్తూ కనిపించారు. ఆ శాటిలైట్ కు ‘బండ లింగంపల్లి’ అనే ఒక సైన్ బోర్డు కూడా ఉంది. మరోవైపు ఈ పోస్టర్ లో పల్లెటూరు వాతావరణంతో ఉన్న పశువులు మరియు ఊరి జనాలు కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం ఎక్స్పెరిమెంటల్ కామెడీ సినిమా గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 1979 నేపథ్యంలో తెరకెక్కనుంది. విశ్వక్ ఖండేరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చారు. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవల కాలంలో సత్యదేవ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో సత్యదేవ్ ‘తిమ్మరుసు’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

x