గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ‘సీటీ మార్’. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో గోపీచంద్ మరియు తమన్నా కబడ్డీ కోచ్లు గా నటించారు. ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది.

ప్రస్తుత నివేదికల ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్లను నమోదు చేసినట్లు చిత్ర యూనిట్ చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 600 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి రోజు 3.5 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ గా ఈ సినిమా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 90 లక్షల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా ఉత్తరాంధ్రలో 29 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు మరియు నెల్లూరులో 19 లక్షల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 2.98 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా శని, ఆదివారాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూలు చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

x