హర్ష కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్ల గా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ సినిమా సెహరి. ఇటీవల నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రోలీజ్ చేయడంతో అందరీ దృష్టి ఈ సినిమా పై పడింది. అప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఈ సినిమాను వార్తలో నిలిచేలా చేశాయి. హర్ష కానుమిల్లి కి ఇది డెబ్యూ మూవీ కావడం, బాలయ్య బాబు ఈ యువ హీరోని వర్జిన్ స్టార్ గా సంబోధించడం తో, ఇదే ట్యాగ్ లైన్ తో సెహరి చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

రొమాంటిక్ ఎంటెర్టైనగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయింది. టీజర్ సార్టింగ్ లో బాలకృష్ణ హీరోని వర్జిన్ స్తర్ గా పిలిచినా క్లిప్ ని పెట్టారు చిత్ర యూనిట్. ఇక కథ విషయానికి వస్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే ఫ్రెష్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయేలా ఉంది.

ఈ సినిమాకు జ్ఞాన సాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తున్నాడు. శిల్ప చౌదరి మరియు అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

x