శర్వానంద్ ( Sharwanand ) ప్రస్తుతం తన తదుపరి చిత్రం “ఆడ‌వాళ్లు మీకు జోహార్లు” షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధికా శ‌ర‌త్‌కుమార్, ఖుష్బూ మరియు ఊర్వ‌శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం సినిమా షూటింగ్లో ఈ సీనియర్ యాక్ట‌ర్లు పాల్గొన్నారు. హీరో శ‌ర్వానంద్ త‌న ఇంటి నుంచి స్పెష‌ల్ గా భోజ‌నం తెప్పించి సీనియర్ యాక్ట‌ర్ల‌కు వ‌డ్డించాడు.

ఈ విష‌యాన్ని రాధికా శ‌ర‌త్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ‌ర్వానంద్ ఇంటి ద‌గ్గ‌ర నుంచి భోజనం రాగానే మేము క్యార‌వాన్ల‌ను విడిచి పెట్టి ఆ భోజనం చుట్టూ చేరాము. ఆ తర్వాత శ‌ర్వానంద్ వడ్డించిన భోజనాన్ని తిని చాలా బాగా ఎంజాయ్ చేశామని” రాధికాశ‌ర‌త్ కుమార్ ట్వీట్ చేశారు. ‘సుధాక‌ర్ చెరుకూరి’ శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

x