బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే, మూవీ మేకర్స్ ముంబైలో ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రాంభించారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా హిందీ, తమిళ్ మరియు తెలుగు వెర్షన్‌ల కోసం దర్శకుడు అట్లీ మూడు విభిన్నమైన టైటిల్స్ ను నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు హిందీలో రాజ వర్ధన్ ఠాకూర్, తెలుగులో కత్తి కొండల రాయుడు మరియు తమిళం లో వేలుస్వామి మురుగన్ అనే పేర్లు పెట్టారు. ఈ పేర్లు వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ, అధికారికంగా ప్రకటించినప్పుడు ప్రేక్షకులు వాటిని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌ గా నటిస్తుంది. సన్యా మల్హోత్రా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

x