ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారతీయ చలన చిత్ర పరిశ్రమను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ రోజుల్లో కొత్తగా అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వేదిక పైకి వస్తున్నాయి. ప్రస్తుతం నటి షకీలా కూడా ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

రామానాయుడు స్టూడియోలో నటి షకీలా ‘అట్టర్ ఫ్లాప్’ మరియు ‘రొమాంటిక్ చిత్రాల’ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ రెండు సినిమాల్లో ఆమె కుమార్తె ‘మీలా’ హీరోయిన్ గా నటిస్తున్నారు. రమేష్ కావాలి ఈ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

నటి షకీలా మాట్లాడుతూ, “రమేష్ కావాలి చెప్పిన రెండు కథలు నచ్చడంతో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నాము. కొత్త నటీనటులతో ఈ సినిమాలను తీస్తున్నాము మరియు ఈ రెండు సినిమాల్లో నా కుమార్తె హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం గోవాలో సినిమా షూటింగ్ జరుగుతుందని షకీలా చెప్పుకొచ్చారు.

మా మునుపటి చిత్రం “లేడీస్ నాట్ అలోవ్డ్” యొక్క సెన్సార్ ప్రక్రియలో మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాము. అలాంటి అడ్డంకులను నివారించడానికి మేము ప్రస్తుతం ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్లాట్ ఫామ్ చాలామంది కొత్తవారికి వేదిక అవుతుందని” షకీలా తెలిపారు.

దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, “ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో మేము అనేక ప్రాజెక్టులతో మీ ముందుకు వస్తాము. షకీలా గారి మద్దతుతో మేము ఈ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభించామని చెప్పుకొచ్చారు. కొత్త నటీనటులు మరియు దర్శకులు వారి షార్ట్ ఫిలిమ్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఉచితంగా విడుదల చేసుకోవచ్చని” ఆయన చెప్పారు.

x