ఆది సాయికుమార్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం శశి. ఈ సినిమా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో ఓకే ఓకా లోకం అన్న పాట వైరల్ గా మారింది. నిజానికి, ఆ ఒక్క పాట  చాలా మంది ప్రేక్షకులను థియేటర్లకు లాగింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

ఈ సినిమా రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కింది, ఈ సినిమా ఒక నిర్లక్ష్య యువకుడి కథ, అతని పేరు రాజ్. శశి తో ప్రేమలో పడిన తరువాత అతని జీవితం ఎలా తలక్రిందులైంది అనేది ఈ చిత్రం యొక్క ప్రధాన అంశం. ఈ సినిమాలో సురభి హీరోయిన్ శశి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో ఆడలేదు.

ఈ సినిమాకు శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించారు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు మరియు చింతలపుడి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. అరుణ్ చిలువేరు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. థియేటర్లలో సినిమా చూడని వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూడవచ్చు. మరోవైపు, ఆది సాయికుమార్ ఇటీవల తన కొత్త సినిమాను కొన్ని రోజుల క్రితం లాంచ్ చేశాడు.

x