ముంబై పోలీసులు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త ను పోర్న్ ఫిలిమ్స్ కేసులో అరెస్ట్ చేశారు. పోర్న్ ఫిలిమ్స్ తీసి వాటిని మొబైల్ యాప్స్ ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై కేసు నమోదు అయ్యింది. ఆ కేసు ఆధారంగా రాజ్ కుంద్రా ను అరెస్టు చేశామని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

“పోర్న్ ఫిలిమ్స్ తీసి రిలీజ్ చేస్తున్నాడని అతని పై క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక కుట్రదారుడిగా భావిస్తున్నామని, అందుకే అతన్ని అరెస్ట్ చేశామని, ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పోలీస్ కమీషనర్ తెలిపారు.

x