బెంగాల్లో పిడుగుల వర్షం 23 మంది ప్రాణాలను బలి తీసుకుంది. పిడుగు వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరోవైపు కొంకణ్ తీరం తో పాటు ముంబైలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులను అలర్ట్ చేశారు.

దక్షిణ బెంగాల్ జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మూడు జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఒక హుబ్లీ లోనే పిడుగుపాటుకు కు 10 మంది ప్రాణాలు కోల్పోగా, ముర్షిదాబాద్ లో 9 మంది, హౌరా మరియు పశ్చిమ మిడ్నాపూర్ లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

పిడుగులు వల్ల చనిపోయిన వారికి ప్రధాన మోడీ సంతాపం తెలిపారు. ఇక మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనితో రాష్ట్ర యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తం చేశారు.

x