ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. అయితే, ఈ చిత్రం లో మిగిలి ఉన్న షూట్ ఈరోజే మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ షూటింగ్ లో చిరు, కాజల్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొననున్నారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

x