మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి చేయి దాటి పోతుంది, ఒక్కరోజులోనే 40 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి లాక్‌డౌన్ తప్పదా అనే సందేహలు కలుగుతున్నాయి. కరోనా కట్టడికి అది ఒక్కటే మార్గమని అని అనుకుంటున్నారు. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని సూచిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్ రేయ్.
కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే లాక్ డౌన్ తప్పదని ముందే హెచ్చరించారు ఉద్ధవ్ థాక్రేయ్. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకోబోతుంది. మహారాష్ట్ర లో నిన్న ఆదివారం ఒక్కరోజులోనే 40 వేల 414 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 68 వేల 266 కేసు నమోదు అయితే అందులో సగం కంటే ఎక్కువ ఒక మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం.
ఈ మధ్య కాలంలో నమోదవుతున్న కొత్త కేసులో ఎప్పుడు కూడా మహారాష్ట్ ముందంజలో ఉంటుంది. ఈ పరిస్థితి లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆరోగ్య శాఖ అధికారులతో పాటుగా ఇతర విభాగాల అందరితో కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో కోవిడ్ టాస్క్ ఫోర్స్ లాక్ డౌన్ విధించాలని సూచించింది. కాకపోతే ఎన్నిరోజులు లాక్ డౌన్ విధించాలనే దానిమీద మహారాష్ట్ర ప్రభుత్వం అలొచిస్తుంది.
కనీసం 15 రోజులు అయినా లాక్ డౌన్ విధిస్తే తప్ప ఫలితం కనిపిన్చదని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చెప్పింది. దీనితో ఎన్నిరోజులు విధించాలనే దానిపైన ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ విధించే నిర్ణయం కాయమని స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో మహారాష్ట్రంలో అనేక జిల్లాల్లోనూ, అనేక పట్టణ ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ కర్ఫ్యూ వంటి అంశాలు నమోదు అవుతుయి.