యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి ఒక కేసులో అరెస్టయ్యారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నరసింహారెడ్డి పై చీటింగ్ కేసు నమోదయ్యింది. కోటి రూపాయలు తీసుకొని మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 2017 నుండి ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేశారని బాధిత మహిళ ఆరోపించింది. నరసింహారెడ్డి తోపాటు ఈ వ్యవహారంలో రాయబారం నడిపిన ఒక మహిళ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వివరాలు ఇంకా వెల్లడి కాలేదు
శ్యామల మాట్లాడుతూ, “నిన్నే మేము మా అత్తగారి ఊరు నుండి హైదరాబాద్కు వచ్చాము మరియు నాకు కొంత జ్వరం ఉండటంతో నేను నిద్రపోయాను. నా భర్త సోమవారం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను ఏదో పనిలో బిజీగా ఉన్నాడని నేను అనుకున్నాను, తరవాతే చీటింగ్ కేసులో అతన్ని అరెస్టు చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నాను, ”అని శ్యామల అన్నారు.
తన భర్త గురించి మరియు అతని ప్రవర్తన గురించి తనకు బాగా తెలుసునని శ్యామల అన్నారు, “మాకు వివాహం జరిగి పదేళ్ళు అయింది, నాకు అతన్ని గురించి పూర్తిగా తెలుసు. అతను కోటి రూపాయల కోసం ఒక ఆడపిల్లని మోసం చేయాల్సిన అవసరం గాని, ఆ వ్యక్తిత్వం గాని తన భర్తకు లేదు అని చెప్పండి.
ఈ మొత్తం సమస్య గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పింది. పోలీసులు పూర్తి దర్యాప్తు చేయనివ్వండి మరియు నిజం బయటకు రావనివ్వండి, అప్పుడు మేము ప్రతిదీ వివరంగా చర్చిస్తాము, ”అని శ్యామల ముగించారు.