పోలీసులు చాలా మంది విధి నిర్వాహణలో చాలా కఠినంగా ఉంటారు, కానీ కొన్ని సందర్భాలల్లో పోలీసులు తమకున్న మానవత్వని చూపిస్తుంటారు. తాజాగా ఒక ఎస్ ఐ చేసిన చేసిన సాహసానికి ప్రజలు మరియు అధికారి సిబ్బంది ఆ ఎస్ ఐ పై ప్రశంసలు కురిపించారు. అర్ధరాత్రి ఎస్ ఐ చేసిన పనికి అందరూ చప్పట్లతో అభినందించారు.

వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం, కొట్లాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో, అదే సమయంలో అతని కాపాడడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి ఆ బావిలో మృతి చెందాడు. బావిలో మృతదేహం ఉండటం గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వచ్చారు.

బావి లో ఉన్న మృతదేహాన్ని చుసిన పోలీసులు, మృతదేహాన్ని బయటకు తీయవలసినదిగా అక్కడ గ్రామస్తులను కోరారు. కానీ గ్రామస్తులు దానికి నిరాకరించారు, కారణం ఏమిటంటే అది చాలా పురాతనమైనవి బావి మరియు చాలా లోతుగా ఉంటుందని అంతేకాక బావిలో నీరు కూడా ఎక్కువగా ఉందని గ్రామస్తులు దిగటానికి నిరాకరించారు.

అప్పుడు ఎస్ ఐ ఏడుకొండలు మృతదేహాన్ని బయటకు తీయడానికి తానే రంగంలోకి దిగారు. నడుముకి, కళ్ళకు తాళ్ళు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగిన ఎస్ఐ ఆ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇలా సాహసం చేసిన ఎస్ఐ ని అక్కడి గ్రామస్తులు మరియు అధికారులు అభినందించారు. అనంతరం ఆ మృతదేహాన్ని పోస్టుమార్టర్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

IMAGE SOURCE

x