ఈ మధ్య కాలంలో సింగర్స్ కు మంచి గుర్తింపు దక్కుతుంది. సింగర్స్ కు ఎక్కువ ఫ్రేమ్ వచ్చినప్పుడు వారిలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతుంటారు. లేడీ సింగర్స్ మాత్రం హీరోయిన్స్ అవుతుంటారు. కానీ, ఈ లెక్కన మార్చడానికి మేల్ సింగర్స్ ట్రై చేస్తున్నారు. తాజాగా ఆ లెక్కలోకి ఓ టాప్ సింగర్ వచ్చి చేరారు.

సంగీత దర్శకులు హీరోలు అవ్వడమనే కల్చర్ బాలీవుడ్ లో ఉంది. దానిని బ్రేక్ చేద్దామని సౌత్ లో ఎంతోమంది ట్రై చేశారు. కానీ, ఎస్ వి కృష్ణారెడ్డి, విజయ్ ఆంటోని, జీవీ ప్రకాష్ లాంటి వారికీ మాత్రమే అది సాధ్యమైంది. తాజాగా ఈ లిస్ట్ లోకి సిద్దు శ్రీరామ్ వచ్చి చేరాడు. ఆయన పాటలకు ఏంటో మంది అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం ఆయన పాట సినిమాలో ఉందని తెలియగానే యూత్ అంతా సినిమా థియేటర్లకు పరిగెడుతున్నారు. ఇక ఆయన చూడటానికి బాగానే ఉంటారు. హీరో గా ట్రై చేసుకోవచ్చు అని చాలా మంది అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ ముచ్చట తీరబోతుంది. మణిరత్నం దర్శకత్వంలో హీరోగా సిద్‌ శ్రీరామ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మణిరత్నం తెరకెక్కించిన “కడల్” సినిమాతోనే సిద్‌ శ్రీరామ్‌ కోలీవుడ్ కు సింగర్ గా పరిచయమయ్యారు. అదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. అలాంటి మణిరత్నం సిద్‌ శ్రీరామ్‌ ను హీరోగా పరిచయం చేయనున్నారు. ఇప్పటికే మణిరత్నం కు సిద్‌ శ్రీరామ్‌ కు మధ్య కథా చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందని సమాచారం.

x