తమిళనాడులో నటుడు సిద్ధార్థ్ బీజేపీ నేతల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. కరోనా ను కంట్రోల్ చేయడంలో కేంద్రం విఫలమైందని సిద్ధార్థ్ కామెంట్ చేశాడు. ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ పెరిగాయని సిద్ధార్థ్ చెప్పారు.
24 గంటల్లో 500కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ట్యాగ్ చేశాడు. తన ఫోన్ నెంబర్ ని తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ లీక్ చేసిందని ఆరోపించారు. తమకు వచ్చిన బెదిరింపు కాల్స్ అన్ని రికార్డు చేశానని చెప్పారు సిద్ధార్థ్.