విశాఖ నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం హెచ్ పీ సి యల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ అగ్ని ప్రమాదాన్ని మర్చిపోక ముందు సింహాచలం లో మరో ప్రమాదం జరిగింది. సింహాచలం ఆర్ఆర్ వెంకటాపురం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి.
అర్ధరాత్రి భారీ శబ్దాలతో ట్రాన్స్ ఫార్మర్స్ పేలిపోయాయి. ఆ సమయంలో శబ్దాలు వినిపించడంతో సమీప ప్రాంతాల వారు భయంతో వణికిపోయారు. మంటలు బాగా వ్యాపించటంతో పొగ దట్టంగా కమ్మేసింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్స్ పేలడంతో కొన్ని గంటల పాటు సింహాచలం సబ్ స్టేషన్ పరిధిలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 2 ఫైర్ ఇంజెన్స్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.