అంతరిక్షయానంలో మొదటిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించబోతోంది. యుఎస్ లో ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతున్నాయి మరియు వాటిలో జూలై 11న తమ అంతరిక్ష నౌక యూనిటీ-22ను ప్రయోగిస్తున్నట్లు అంతరిక్షయాన సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ ప్రకటించింది.
ఈ నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు సంస్థ అధిపతి రిచర్డ్ బ్రోన్సన్ మరియు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణిస్తున్నారు. వారిలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల ఒకరు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. వారి కుటుంబం వాషింగ్టన్లో స్థిరపడ్డారు. ఆమె వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష యానం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఆమెతో పాటు బెత్ మోసెస్ మరియు కాలిన్ బెన్నెట్ అనే ఇద్దరు అంతరిక్ష యానం చేయబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్ ఫ్లైట్ బయల్దేరనుంది. త్వరలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర చేయనున్నారు. దానికి పోటీగా వర్జిన్ గెలాక్టిక్ ఈ అంతరిక్ష యాత్రను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.