17 ఏళ్లుగా అతని భార్య శవం పక్కనే, ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్నమైన ఆలోచన. ఇది ఒక భర్తకు భార్య పై వున్నా అంతులేని ప్రేమకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన స్టోరీ.
చనిపోయిన భార్యను విడవలేక తన భర్త ఆమె శవంతోనే 17 సంవత్సరాలుగా నిద్రపోతున్నాడు, మరి అన్నేళ్లు శవం తో ఎలా అనేగా మీ సందేహము. ఆ పూర్తీ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
17 సంవత్సరాలుగా భార్య శవం పక్కనే నిద్ర, ఈ వియత్నమైన వ్యక్తి భార్య చనిపోయిన సరే తనని ప్రేమిస్తూనే వున్నాడు. తన భార్యను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేక ఆమె శవాన్ని తన పక్కలో పెట్టుకొని నిద్రపోతున్నాడు.
భార్యను విడవలేక ఈ వ్యక్తి ఆమె సమాధి పక్కనే నిద్రపోయేవాడు. నెలలు పాటు అతను స్మశానంలోనే గడిపాడు. అనుకోకుండా ఒక రోజు వర్షం కురవడంతో తన భార్య సమాధి పక్కన పడుకోవటం కుదరలేదు, దీనితో ఆమె సమాధి పక్కనే మరొక గొయ్యి తవ్వుకొని, తన భార్యకు దగ్గరగా పడుకున్నాడు. చాలా రోజుల తరువాత అతని పిల్లలు ఈ విషయం గురించి తెలుసుకున్నారు.
పిల్లలు అతనితో వాదించి తనని ఇంటికి తీసుకువెళ్ళారు. అతని భార్య లేకుండా ఉండలేక పోయాడు. దీంతో స్మశానంలోకి వెళ్ళి ఆమె సమాధిని తవ్వి ఆమె అస్థికలను ఇంటికి తెచ్చి వాటిని తన పడక గదిలో పెట్టుకొని నిద్రపోయాడు.
ఆమె అస్థికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంట్,జిగురు,ఇసుక మిశ్రమం తో అతను ఒక మహిళా బొమ్మను తయారు చేసాడు. అతని భార్య అస్థికలను అందులో ఉంచి అందులోనే ఆమెను చూసుకుంటున్నాడు.