ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ అందరిని వణికిస్తుంది. ఓ వైపు కరోనా కొత్త కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే, గడచిన 24 గంటల్లో దేశంలో 2 లక్షల 38 వేల 18 కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 17 లక్షల 36 వేల 628 గా ఉంది. ఇక ఇండియాలో 8 వేల 691 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజువారి పాజిటివీటి రేటు 14.43 శాతానికి పడిపోయింది.

x