విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా, నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఎస్‌6 బోగీలో హఠాత్తుగా పొగలు వ్యాపించాయి.

ట్రైన్ లో పొగలు రావడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్లు ట్రైన్ ను వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కొంతమంది టెక్నికల్ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

ఎస్6 బోగీ బ్రేకులు జామ్ కావడంతోనే ఈ పొగలు వచ్చాయని టెక్నికల్ సిబ్బంది అక్కడ అధికారులతో చెప్పారు. ఆ తర్వత టెక్నికల్ సిబ్బంది వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారమైన వెంటనే ఆ ట్రైన్ తిరిగి బయలుదేరింది. దీంతో ప్రయాణికులు దాదాపు గంటకు పైగా ఆ రైల్వేస్టేషన్లోనే పడిగాపులు పడ్డారు.

x