అనంతపురంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక యువకుడిని ఫేస్బుక్ కాపాడింది. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా స్నేహితులకు క్షమించండి అన్న అంటూ యువకుడు మెసేజ్ లు పంపించాడు. తాను చనిపోతున్నాను అంటూ పంపిన సందేశం ఆధారంగా జగ్గయ్యపేట కు చెందిన మిత్రులు వెంటనే స్పందించారు.

జగ్గయ్యపేట అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు మహంకాళి జయ ప్రకాష్ ఆ యువకుడు మెసేజ్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ఆ యువకుడిని రక్షించారు. తాటిచెర్ల సమీపంలో రైల్వే ట్రాక్ పై యువకుడు పడుకొని పట్టాలపై నుంచే ఫేస్ బుక్ లో ఫోటోలు పోస్ట్ చేశాడు. ఫోటో ఆధారంగా పోలీసులు యువకుడుని రక్షించి అనంతపురం పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు.

సూసైడ్ కి పాల్పడిన యువకుడిని అందరూ సకాలంలో స్పందించి రక్షించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన జగ్గయ్యపేట అన్నపూర్ణ సేవా సమితి సభ్యులను పోలీసులు మరియు స్థానికులు అభినందించారు. ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడి పేరు సతీష్. పోలీసులు అతని కి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు.

x