మన దేశంలో కొనసాగుతున్న మహమ్మారి కరోనా నుంచి ప్రజలకు సహాయపడటానికి సోను సూద్ వివిధ ఆసుపత్రులకు మరియు సంస్థలకు ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఆక్సిజన్ సాంద్రతలను ఇస్తున్నాడు. ఇప్పుడు, సోను భారతదేశంలోని విభిన్న ప్రదేశాల్లో ఆక్సిజన్ ఏర్పాటుచేయడానికి ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల నుండి ఆక్సిజన్ ప్లాంట్లను తీసుకువస్తున్నాడు.
ఫస్ట్ వేవ్ లో మరణాల రేటు తక్కువ గా ఉండడంతో సెకండ్ వేవ్ ను నిర్లక్ష్యం చేశారు. దీనికి ఫలితంగా ఈ సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఇలా ఉంటె థర్డ్ వేవ్ ఇంకెలా ఉంటుందో ఊహించలేకపొతున్నారు.
మన ప్రభుత్వాలు థర్డ్ వేవ్ ను ఎదురుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందోగాని.. ప్రజలకు ఆపద అంటే మాత్రం తాను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేసే సోను సూద్ మాత్రం, వచ్చే థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు.
సెకండ్ వేవ్ లో ఉన్న ఆక్సిజన్ కొరత థర్డ్ వేవ్ లో ఉండకూడదని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్టాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రాన్స్ నుంచి ఒక ఆక్సిజన్ ప్లాంట్ ను బుక్ చేశామని మరో 10-12 రోజుల్లో ఆ ప్లాంట్ వస్తున్నట్లు సోను చెప్పాడు. అంతేకాదు మరి కొన్ని దేశాలల్లో ఆక్సిజన్ ప్లాంటు ను కొనుగోలు చేయడానికి చర్చలు చేపడుతున్నట్లు సోను చెప్పారు.