కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ సోను సూద్ మాత్రం కష్టాల్లో ఉన్న జనానికి సహాయం చేసే గుణాన్ని ఏమాత్రం వదులుకోలా, శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్పూర్ నుండి హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్లో విమానంలో తరలించాడు.
కోవిడ్ కారణంగా దాదాపు 85-90 శాతం ఊపిరితిత్తులను కోల్పోయిన భారతి అనే 25 ఏళ్ల అమ్మాయి, సోను సూద్ సహాయంతో చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని వోక్‌హార్డ్ట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్స్ ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా కొన్ని ప్రత్యేక చికిత్స అవసరమని, హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యం అని చెప్పారు.
వెంటనే, సోను సూద్ అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ను సంప్రదించి, ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని తెలుసుకున్నారు, దీనితో శరీరానికి కృత్రిమంగా రక్తం సరఫరా చేయడం వల్ల ఊపిరితిత్తుల నుండి ఒత్తిడిని తొలగించవచ్చు అని తెలుసుకున్నారు.
ఈ ECMO చికిత్స సెటప్ కోసం మొత్తం హైదరాబాద్ నుండి ఆరుగురు వైద్యులు రావాలి, అందుకే ఒక రోజు ముందుగానే, ఎయిర్ లిఫ్ట్ ఎయిర్ అంబులెన్స్‌లో చికిత్స చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో భారతికి ఉత్తమమైన చికిత్స అందుతుంది.
దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ, “అవకాశాలు 20 శాతం ఉన్నాయని వైద్యులు చెప్పారు మరియు మీరు ఇంకా దీనితో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా అని నన్ను అడగగా నేను ‘తప్పకుండా అని చెప్పాను. ఆమె 25 ఏళ్ల యువతి మరియు ఆమె గట్టిగా మీ ట్రీట్మెంట్ కు స్పందిస్తారు మరియు ఆమె దాని నుండి బలంగా బయటకు వస్తుందని కోరికుంటున్నాము.. ‘
అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాము మరియు ఆమెకు చికిత్స చేయడానికి ఎయిర్ అంబులెన్స్ మరియు దేశంలోని ఉత్తమ వైద్యుల బృందాన్ని పొందాలని నిర్ణయించుకున్నాము’. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స బాగా జరుగుతోంది, మరియు మేము ఆశిస్తున్నాము ఆమె త్వరలోనే కోలుకుంటుందని” అని చెప్పారు. భారతి తండ్రి ఒక రిటైర్డ్ రైల్వే అధికారి.