యాక్టర్ సోనూసూద్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈరోజు ఉదయం కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే తాను క్వారంటైన్ లో ఉన్నానని జాగ్రత్తలు తీసుకుంటున్నానని సోనూసూద్ చెప్పారు. అవసరమైన వారికి సహాయం చేసేందుకు ఇప్పుడు మరింత సమయం దొరికిందని, సమస్య వస్తే పరిష్కరించేందుకు ఉన్నానంటూ ట్వీట్ చేశారు.

మరో వైపు యాక్టర్ సోనూసూద్ కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రిక్వెస్ట్ లు పెరిగాయి. నిన్న ఉదయం నుంచి వేలాది మంది బెడ్స్, మెడిసిన్స్ మరియు ఇంజక్షన్స్ కోసం తనకు ఫోన్ చేస్తున్నారంటూ సోనూసూద్ చెప్పారు. అందులో చాలా మందికి తాను సహాయం చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సాహాయక స్థితిలో ఉన్నానంటే ఆయన చెప్పారు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఇళ్లలోనే ఉండాలని, మాస్కు తప్పని సరిగా ధరించాలి అని ఆయన సూచించారు.

కరోనా ఫస్ట్ వేవ్ టైంలో అవసరం ఉన్నవారికి దగ్గర వుంది సాయం చేశారు సోనూసూద్. వలస కార్మికులకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయటం తో సహా అవసరమైన రోగులకు వైద్య సహాయం అందించారు. లాక్‌డౌన్‌ టైమ్ లో ప్రభుత్వాల సహాయం కంటే సోనూసూద్ సాయం ఎక్కువగా వినిపించండి. ఆ తర్వాత కూడా చాలామంది సోనూసూద్ సహాయం తీసుకున్నారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

ఇటీవల ఆశ్చర్య షూటింగ్లో సోనూసూద్ పాల్గొన్నారు. షూటింగ్ కు సోనూసూద్ సైకిల్ మీద వెళ్తున్న విజువల్స్ ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

x