ఫాదర్స్ డే సందర్భంగా సోనూసూద్ తన పెద్ద కుమారుడు ‘ఇషాంత్ సూద్’ కు రూ .3 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారని పుకార్లు వచ్చాయి. సోనూసూద్ మరియు వారి కుటుంబం ఒక సరికొత్త కారులో ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.

ఇటీవల 18 ఏళ్లు నిండిన తన కుమారుడు ఇషాంత్ కు సోనూసూద్ ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోనూసూద్ స్పష్టం చేశారు.

ఆ వార్త అబద్ధం అని, నేను నా కొడుకు కోసం కారు కొనలేదని, ఆయన స్పష్టం చేశారు. ట్రయల్ కోసం కారును మా ఇంటికి తీసుకు వచ్చారు. మేము దానిని టెస్ట్ డ్రైవ్ చేసాము అంటే కానీ, కారు మాత్రం కొనలేదు. అని సోనూసూద్ స్పష్టం చేశారు.

ఫాదర్స్ డే రోజు వైరల్ అవుతున్న పుకార్ల ను చూసి సోనూసూద్ ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అన్నారు… “నేను నా కొడుకు కోసం ఫాదర్స్ డే రోజు ఎందుకు ఖరీదైన బహుమతి కొంటాను..? ఎక్కడైనా ఫాదర్స్ డే రోజు కొడుకు కదా బహుమతి ఇవ్వాల్సింది..? నా ఇద్దరు కుమారులు ఫాదర్స్ డే రోజు నాకు ఉత్తమ బహుమతిగా ఇవ్వగలిగినది ఏమిటంటే వారు సమయాన్ని నాతో గడపడమే. నా తీవ్రమైన షూటింగ్ షెడ్యూల్ కారణంగా, నేను వారికి సమయం కేటాయించలేక పోతున్నాను. వారు సమయాన్ని నాతో గడిపిన రోజు నేను సంపాదించిన లగ్జరీ అని” చెప్పుకొచ్చారు సోనూసూద్.

Image Source

x