ఈ మహమ్మారి కరోనా సమయంలో సోను సూద్ ప్రజలకు చాలా సాయం చేస్తున్నారు. ప్రస్తుతం సోను సూద్ చేస్తున్న సేవలు చూసి ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు, మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు ల విషయంలో సోను సూద్ వారి పై ప్రశంసలు కురిపించారు.
“చిరంజీవి సార్ మీరు చేస్తున్నది నిజంగా స్ఫూర్తిదాయకమైనది. ప్రభుత్వాలు ప్రతిదీ చేయలేవు. సినీ తారలు సామాజిక బాధ్యత తో ముందుకు వస్తే, అది ప్రజలకు కొంత ఓదార్పునిస్తుంది మరియు వారు కొంచెం ధైర్యం గా ఉంటారు. ఆర్థికంగా ముందుకు వచ్చి బాధలో ఉన్న వారికి సహాయం చేయాలి” అని సోను సూద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఏర్పాటయ్యాయి. చిరంజీవి అభిమాన సంఘాలు జిల్లా స్థాయిలో ఈ బ్యాంకులను పర్యవేక్షిస్తున్నారు.